Download App Open in App

లోకేషన్స్ వేటలో కొరటాల...

  • IndiaGlitz, [Monday,March 20 2017,]

ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. మురుగ‌దాస్ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌దుప‌రి కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఉంటుంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది.

ప్ర‌స్తుతం దేవిశ్రీ ప్ర‌సాద్ దుబాయ్‌లో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్రెడి రెండు ట్యూన్స్ కూడా కంపోజ్ చేసేశాడు. కొర‌టాల ఇప్ప‌డు లోకేష‌న్స్ వేట‌లో బిజీగా ఉన్నాడు. దేవితో మ్యూజిక్ సిట్టింగ్‌లో పాల్గొన్న కొర‌టాల శివ అటు నుండి అటే లండ‌న్‌, ఇట‌లీ, స్పెయిన్‌ల‌లో లోకేష‌న్స్ చూడ‌టానికి వెళ్లాడు. సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఇక్క‌డే జ‌రుగుతుంద‌ట‌. ఈ చిత్రానికి భ‌ర‌త్ అనే నేను అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. ఇక మ‌హేష్‌, మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తున్న‌ స్పై థ్రిల్ల‌ర్‌లో మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 23న విడుద‌ల కానుంది.

Latest News